Telugu Poem లోకం తీరు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem లోకం తీరు

Rating: 5.0

* లోకం తీరు *

ఎక్కడో కలుసుకుంటాం
మరెక్కడో విడిపోతాం
ఒకరికొకరు ఎడురుపడగానే
కళ్ళజోడు వెనుక కళ్ళను దాచేసి
ఓ చిరునవ్వును విసిరేసుకుంటూ
మాటల్ని మూటగట్టేసుకుంటాం

వేషాన్ని మార్చేసి
అన్నీ మరచి పోతుంటాం
పరిచయాన్ని దాచేసి
అపరిచితులమై తిరుగుతుంటాం

తెలియని కొత్తదనాలకు మురిసిపోతూ
గుండెను సిలుక్కొయ్యకు తగిలించి
దేహాన్ని వెంటబెట్టుకొని కదులుతుంటాం

అడుగుజాడలను వేరు చేస్తూ
వేరుచేసిన వాటిని చెరిపేస్తూ
దారినే మాయం చేస్తుంటాం
రేపటి దారి కనబడక రోదిస్తుంటాం

మార్పుకోసం తహ తహలాడుతాం
మారడానికి మాత్రం వెనకడుగేస్తాం
మన తప్పులు మనమే మరచి
మనుషుల్లాగానే మిగులుతున్నాం
మరణందాకా రగులుతున్నాం

ఎంత దాచుకున్నా
దేహాన్ని ఖాళీ చేసిన రోజున
చేతిలో చిల్లిగవ్వ లేని ఆత్మను తిట్టుకుంటూ
మళ్ళీ పుడుతుంటాం

~ పారువెల్ల ~
08-04-2013

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success