Telugu Poem బతికున్నట్టు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem బతికున్నట్టు

* బతికున్నట్టు *

ఎప్పుడు ఎదురుపడ్డా
ఎలాగున్నావన్న ప్రశ్నను నములుతుంటాం

నములుకుంటూనే
బ్రతుకంతా మబ్బుల మీద ఆరేసుకుంటాం
ఎలా తడిసిపోయింది..
ఎందుకు తడిసి పోయిందీ...
ఎంతకీ తెలియదు

పదిలంగా దాచుకున్న ఒక్కొక్క అడుగునీ
ఒకరికొకరం చూపించుకున్నాక
గాయాన్ని దేవుణ్ణి చేసి
జ్ఞాపకానికి గుడి కట్టుకున్నట్టు
దుఃఖాన్ని ప్రసాదంలా పంచుకున్నట్టు ఎవ్వరికీ తెలియదు

ఏ ఇసుకనో.. ఏ మట్టినో...
ఏ అడవినో.. ఏ తనువునో..
మళ్ళీ తడిపేస్తామని
ఇంకెవ్వరికీ తెలియదు

శవ పేటికలో ఓ కల బతికున్నట్టు
ఇంకెప్పటికీ తెలియదు

~ పారువెల్ల ~
12-03-2015

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success