వెన్నెల ఉదయించనీ...
చిక్కటి చీకటి వానకు తడిసిపోయావా
కనిపించక ఎక్కడికో వెళ్ళిపోయావు
అంతా మరిచిపోయావు
అన్నీ విడిచిపెట్టావు
నీకోసం ఎవరో మరణించినట్టు
నీవందుకే చిగురించినట్టు
ఏదీ గుర్తులేదు నీకు
కలలో పూసిన స్వర్గాన్ని
తెల్లారగానే తగలబెడుతున్నావు
మట్టిబెడ్డల మాటున
ఓ విత్తనం దాహం అంటున్నది
కనీసం రెండు కన్నీటి బొట్లయినా చాలు
లేదంటే
ఇక పూసేందుకు కాసేందుకు
మొక్కలకు మానులకు మనసిరిగి పోతుంది
పారువెల్ల
30-11-2016
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem