Telugu Poem చీకటే చెప్పింది Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem చీకటే చెప్పింది

Rating: 5.0

*చీకటే చెప్పింది*



ఎంత వెలుగును మోద్దామనుకున్నానో
జారి, చీకట్లో యెలా పడ్డానో

అనంత విశ్వం నాలాగే
అగాధమూ నాలాగే
వెలుతురు వెనుక చీకటిలా
అంతు చిక్కని దుఃఖం నాలాగే

నయమే, ఈ చీకటే చెప్పింది నాకు
నేనెవరో
నాకెవరో

పారువెల్ల

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success