Telugu Poem ఉత్తుత్తిగానే Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఉత్తుత్తిగానే

Rating: 4.0

ఉత్తుత్తిగానే

బెదిరిపోతావెందుకు  
కసిలేని ఉరుములకు

మురిసిపోతావెందుకు  
పసలేని మెరుపులకు

తడిసిపోతావెందుకు  
తడిలేని మబ్బులకు

మూడడుగులే దూరం  
నాలుగడుగులే తోవ  
ఆరడుగులే  గమ్యం  
అయినా ఇంకా ఏదో...

వె
తు
కు
తుం
టా
వ్. 

పారువెల్ల
02-01-2018

Sunday, January 21, 2018
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success