Telugu Poem అంతా నువ్వే Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem అంతా నువ్వే

అంతా నువ్వే

అడుగు ఒక అక్షరం
అనుభవమొక వాక్యం
బ్రతుకంతా భావశకలం.
ప్రాణం ముందుమాట
మరణందాకా కవిత్వమే

పెదవి విప్పకున్నా
నిజం దాచుకున్నా
రహస్యమేదీ లేదు
అన్నీ నీకు అనువాదాలే

పారువెల్ల

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success