Telugu Poem అసమర్థుని జీవ యాత్ర Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem అసమర్థుని జీవ యాత్ర

అసమర్థుని జీవ యాత్ర

మనసులేని
రాతిబండల గుండెలమీద
నిర్దాక్షిన్యంగా నడిచి వెళ్తావు

రూపమొచ్చిన రాయి ముందు
మోకాళ్ళ మీద నిలబడి
మొక్కి పోతావు!

గుండె మారని బండ
రూపం మార్చుకుంటే
నువ్వెందుకు మారావో నీకైనా తెలుసా! !

ఎంతో దూరం నడిచి వెళ్తావు.
ఎన్నో దారులు తిరిగి వస్తావు.
అయినా,
నీలోనికి నీపయనం
మొదలవక ముందే అలసిపోతే
తొక్కిన బండలైనా
మొక్కిన బండలైనా
తోడెందుకు వస్తాయో నువ్వే చెప్పు.

పారువెల్ల
01-02-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success