Telugu Poem ఈ రేయి Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఈ రేయి

Rating: 5.0

ఈ రేయి

గాలి వీచినంతసేపు
పిట్టలు ఎగిరినంతసేపు
నువ్వొస్తావని
తీయని కబురొస్తుందనే ఆశ తప్ప

సంద్రంలో ఏ సందడీ లేదు
అలలలా ఉరకాలనీ.
ఒడ్డును చేరి
నురగలా నవ్వుకోవాలనీ.

మబ్బులకుయే ముచ్చటా లేదు
మంచులా కరిగిపోవాలనీ.
తనకు తానే
తనివితీరా తడిసిపోవాలనీ.

మట్టికి యే ఆశా లేదు
చినుకంతచిగురించాలనీ.
ఆకు పచ్చగా
పురివిప్పిపులకరించాలనీ.

ముసలి సూరీడు ముఖం తిప్పుకున్నాక మొలకెత్తిన వెన్నెల మొగ్గవేమో నువ్వు
సఖీ, నేను నడుస్తున్నంత సేపు నువ్వు నాదానివే.

మొహమాటమే వద్దు!
సుక్కలు ఈ రాత్రికి కాసేపు సిగ్గు పడనీ...

పారువెల్ల
01-08-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success