Telugu Poem నిజాల నీడలు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నిజాల నీడలు

నిజాల నీడలు

ఎంత దూరం వెళ్లినా
ఎంత ఎత్తుకు యెదిగినా
అబద్దాన్ని మోస్తున్నంతసేపు ప్రతీ అడుగులో భయమే.

నిజాన్నివెలివేస్తే నీడై ఎదురొస్తది.
ప్రతీ క్షణం భయపెడుతుంటది.
దూరమెంత ఉరికినా పదే పదే తరుముతుంటది.

తప్పించుకు తిరిగేందుకు చీకటిలో దూకేస్తే
పారే నిజాలమీద నిర్జీవమైతేలిపోతావు.
నీడలంతే...., వాటికి
తోడుగా వెంట నడవడమూ తెలుసు.
వెంటాడి వెంటాడి తరమడమూ తెలుసు.

పారువెల్ల
11-11-2014

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success