Telugu Poem విధి Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem విధి

Rating: 4.0

విధి

తాను కురిసి
మట్టిని తడిపేయాలని
మబ్బుకు మాత్రం ఆశ లేదంటావా
నాలాగే..!

మతిలేని గాలి
గతి తప్పి తరుముతుంటే
జాలిగుండెల మబ్బుజారిపోయింది మట్టిని విడిచివెళ్ళిపోయింది
నాలాగే..!

కాలం అనుకూలమే
సఖీ, విధి బలీయమైనది

పారువెల్ల
07-08-2018

Wednesday, August 15, 2018
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success