Telugu Poem ఎన్ని జన్మలైనా Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఎన్ని జన్మలైనా

ఎన్ని జన్మలైనా

మనిషైనందుకు
మనసున్నందుకు
అది నీకే ఇచ్చినందుకు
తిరిగి ఎంతో కొంత తీసుకుంటాను
నీ కష్టాన్ని
నీ కన్నీళ్లను
నా హృదయపు దోసిట్లోకి

పోయిందేదో పోనీ
జీవితమింకా కొంత మిగిలే ఉన్నందుకు
అయినకాడికే సై
చేయివదిలేదీలేదు
విడిచి వెళ్ళేదీ లేదు
సఖీ.! మరణాన్ని మాత్రం గుర్తు చేయకు
అది నా తొలి ప్రేయసి
నా మనసు మారుతుందేమో

*పారువెల్ల*
08-08-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success