స్వేచ్ఛ
హితులో
సన్నిహితులో
అయినవాళ్ళదగ్గర ఐదు నిముషాలైనా
అచ్చంగా బతకలేనిస్వచ్ఛంగానిలువలేని నీడలు కొన్ని
తల్లీ.. అని మొసలి కన్నీరు కార్చుతూ మట్టిని తడిపేస్తాయి
ఏడాదికి ఒకటి రెండుసార్లుకురిసే రెండు మూడు చినుకుల్లో
నువ్వూ తడిసిపోతావు.
మూడు రంగుల్లో మురిసిపోతావు.
గాలికేం స్వేచ్ఛగానేవీస్తున్నది
అడ్డుగోడ లేని మేఘాలుఅందంగానే కదులుతున్నాయి
ఆకాశంలో బొమ్మలను గీసుకుంటూ, మునుపటి లాగే
దేశమా....నీకు తెలియనిదేముంది!
బతికినోళ్ళెందరో సచ్చిపోయారు
సచ్చినోళ్ళు కొందరైనా బతికున్నారు
ఉన్నోల్లే చస్తూ బతుకుతున్నారు.
అయినా...గాలికేం స్వేచ్ఛగానేవీస్తున్నది.
పారువెల్ల
15-08-2018
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem