Telugu Poem మెలకువ Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem మెలకువ

మెలకువ

యుగాల నిద్రనాది
చీకటి వల విసిరిందేమో!

సఖీ
ఎటునుండి వస్తున్నవో
నడుము సింగారమై
నడక బంగారమై
వలపు శృంగారమై

అనుకోని మెలకువ
ఇది వెన్నెల వేకువ
అలవోకగా నీ గాలే తాకిందో! !

యుగాలు ఇంకిపోనీ
ఎదురు చూపులన్నీ గువ్వల్లా ఎగిరిపోనీ
ఇక కష్టానిదంతా కొనగోటి ప్రాయమే

సఖీ! ఇప్పుడైనా మన హృదయాలను
కాకెంగిలి చేసుకుందాం

పారువెల్ల
30-07-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success