Telugu Poem ఓ మేరా షహర్! Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఓ మేరా షహర్!

ఓ మేరా షహర్!

ఇసుక తెన్నెలు
మేఘాలతో మాట్లాడుతున్నాయిక్కడ.
ప్రతీరాత్రి వెన్నెలవెలుగులే, కానీ వెన్నెలే లేదు!
అద్దంలాంటి రోడ్డుమీద నడుస్తుంటే
జారిపోతానేమోనన్న భయం
నడవడమే ఇష్టంలేదు, బతకడమెంత కష్టం!

ఉడికీ ఉడకని మెతుకులతో
కష్టాలను చెప్పుకుంటూ
కాలీకాలని రొట్టెలతో
కన్నీళ్లను తుడుచుకుంటూ
అద్దం ముందు నిలుచున్నప్పుడల్లా

ఓ మేరా షహర్!
యాదొస్తున్నావు బాగా యాదొస్తున్నావు.
ఇంత దూరం ఎలా వచ్చానో
మనసును నీ దగ్గర వదిలేసి.
నీ ఒడిలోనడుస్తూ పోతుంటే
రోడ్డు కూడా చేయి పట్టుకొని తోడొచ్చేది.
గల్లీలు గోడలూ కూడా గుర్తుపట్టి మాట్లాడేవి.
నీతో పెరిగిన జ్ఞాపకాలన్నీ మేఘాలను చేసి ఇటు పంపు
ఈఎడారిలో కాసేపైనా తడిసి మురిసిపోతాను.

*పారువెల్ల*
18-10-2013

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success