Telugu Poem ఆత్మకథ Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఆత్మకథ

Rating: 4.5

నేనిప్పుడు ఆత్మని
కలవరించిన దేహానికి
కల వరించిన ప్రేమకీ గుర్తుగా.

ఔను, నేనిప్పుడు ఆత్మని
ముచ్చటైన మొన్నటి ముద్దులకి
బిగువైన నిన్నటి కౌగిలింతలకీ
మత్తుగా జోకొట్టిన మనప్రేమ గాధకీ గుర్తుగా.

చూస్తున్నావా...
చీకటి మువ్వల సడి మెలమెల్లగా చేరువవుతున్నది.
వింటున్నావా....
ఈల వేస్తూ గాలి, పాడుకుంటూ తిరిగి, చేస్తున్న చిలిపి అల్లరి.
గుర్తించావా.....
విరహామృతాన్ని తారలకిచ్చి, దాగుడుమూతలాడుతున్న చందమామ దొంగాటను.

ఘాడంగా కప్పుకుంటున్నాయి తలపులు
హృదయాన్ని విప్పుకోవడం తప్పదు ఈ రాత్రికి.

నేనిప్పుడు ఆత్మని, నిన్నా మొన్నటి
తీరని దాహానికి గుర్తుగా
మన గతజన్మకీ సాక్షిగా.

*పారువెల్ల*
23-08-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success