Telugu Poem నీలో నీవు లేనందుకు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నీలో నీవు లేనందుకు

Rating: 4.0

*నీలో నీవు లేనందుకు*

ఆలోచనలన్నింటినీ పిట్టల్ని చేసావు
ఆ పిట్టలకు రెక్కలనిచ్చావు
అన్ని దిక్కులకు యెగిరి పొమ్మన్నావు

తిరిగొచ్చిన పిట్టలు
పదునైన పదాలు మోసుకొచ్చాయి
పదాలను పేర్చి భావాన్ని అల్లుతున్నావు

అందంగావుంది పూలదండ.
నీలో నీవు లేనందుకు
గులాబీలతో పాటు ముళ్ళనూ అల్లేశావు

సఖీ, నీ ప్రేమ(కవిత) లో..
నువ్వే కాదు
నీ మనసు కూడా లేకపోవడమే విషాదం

పారువెల్ల
03-03-2019

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success