Telugu Poem బదిలీ Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem బదిలీ

*బదిలీ*

ఇప్పుడు
ఇందాక నేనునిన్ను తిట్టిన మాట
ఎదురొచ్చి నన్నే తగులుతున్నది

నువ్వు నాకు చేసినగాయం
తిరిగి నిన్నే కోస్తున్నది

నాపాత్రలో నువ్వు
నీపాత్రలోనేను
ఒదిగిజీవించినందుకు
ఒకరికొకరం అద్దంలో చూసుకున్నట్టయ్యింది

సఖీ, ఒక్కసారైనా
స్థానాలు బదిలీ చేసుకోవాలేమో
లేకుంటేఒకరి మనసులో ఇంకొకరం
దోషులుగానే మిగిలిపోయేవాళ్ళం!

పారువెల్ల
04-03-2019

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success