Telugu Poem చలన సూత్రం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem చలన సూత్రం

Rating: 5.0

*చలన సూత్రం*

ఎదగడమెంత కష్టమో!
ఏడంతస్తుల మేడ ఎక్కడమంత.
అంతా అడుగుల బలమే

దిగజారడమెంత సులువో!
ఏడంతస్తుల మేడ దిగడమంత.
అంతా చేతల ఫలమే

ఎక్కుతూ ఎక్కుతూ
మెట్లమీద సంతకాలు చేయడం
నీ కోరిక!

దిగుతూదిగుతూ
ప్రతి సంతకాన్నీ చెరిపివేయడం
నీకు సరదా! !

పారువెల్ల
07-03-2019

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success