Telugu Poem చీకటి స్వర్గం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem చీకటి స్వర్గం

Rating: 5.0

*చీకటి స్వర్గం*

చీకట్లో ఏముంది
కనబడనంత దుఃఖం
కావాల్సినంత నిద్ర

కళ్ళు మూసుకుని
కనులలోకి ఒంపుకున్న కలలన్నీ
నీ ఆస్థి

కళ్ళు తెరిచి
కనులలోకిదింపుకున్న కన్నీళ్లే
నీ దోస్తీ

మిణుగురు పురుగులతో
ఆటాడుకుంటావో
మిణుకు మిణుకుమంటున్నచుక్కలతో
మాట్లాడుకుంటావో
అంతా నీ ఇష్టం, ఈ రాత్రి నీది!

*పారువెల్ల*
08-03-2019

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success