Telugu Poem వాన Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem వాన

Rating: 5.0

వాన


రాలే చల్లని చినుకుల్లో తడిసిపోతూ
వెచ్చని మాటల్లో తడారబెట్టుకుంటూ
ఎంత దూరం నడిచామో గుర్తుకే లేదు

ఎలా మరిచిపోయామో తెలియనే లేదు
వేసిన అడుగుల్లో పూసిన పువ్వులని

చూపుల చివరి అంచుల్లో
ఇద్దరం ఒకే చోట చిక్కుకుంటాం
మాటకు మాటకు మధ్య దూరాన్ని
మౌనమని పేరెన్నడూ పెట్టుకోనందుకో
కొసరి కొసరి మాట్లాడి
ప్రేమను దాచుకున్నందుకో
ఒకరి కనులలో ఒకరం ఒదిగిపోతాం
ఒకరి కలలో ఇంకొకరం మిగిలిపోతాం

జారిపోతున్న ప్రతీ క్షణం
స్పర్శను మరిచిపోవద్దని
పదే పదే వేడుకున్నందుకైనా
రెండు గుండెల నడుమ చోటు దొరకక
ఖాళీతనం కాసేపైనా దిగులుపడనీ

సఖీ!
వానెందుకు వచ్చిందో ఆరా తీయొద్దు
మనమెందుకు తడిసిందీ ఎవ్వరికీ చెప్పొద్దు

~ పారువెల్ల ~
30-06-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success