Telugu Poem ప్రణయం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ప్రణయం

Rating: 5.0

* ప్రణయం* 

వెన్నెల మాసిపోకుండా 
మల్లెలు వాడిపోకుండా 
వయసు ముడేసుకున్న మొహం ఆరిపోకుండా 

అడుగులు వీడిపోకుండా 
ఆశలు వీగిపోకుండా 
నులివెచ్చని దాహంలా 
చిలిపి కోరిక ఒకటి చల్లారి పోకుండా 
అంతా వింతగా  మళ్ళీ కొత్తగా 
ప్రణయమెందుకు పిలిచిందో 
ముసి ముసి నవ్వులతో 
తారలెందుకు మెరిసాయో

చెరో సగమే మనమే అయినా
ఒంపుకున్నామే ఒకరిలోఒకరం

మట్టిలో ఇంకిన వాన చుక్కల్లా
గాలితో కలిసి వీచిన గంధంలా 
పూవులో ఒదిగివున్న తేనె బొట్టుల్లా
మధువులో దాగున్న తెలియని మైకంలా 
తడిసిపోయామేకలిసిపోయామే
కరిగిపోయామే ప్రణయమై

*పారువెల్ల*

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success